మార్చి నెల ముగిసిపోయి ఏప్రియల్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దీనితో ఈ సంవత్సరం మొదటి మూడు నెలలలో విడుదలైన సినిమాలలో బయ్యర్లకు నిర్మాతలకు లాభాలు కురిపించిన సినిమాల లిస్టులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘కోర్ట్’ ‘తండేల్’ ‘మ్యాడ్ 2’ సినిమాలు తప్ప మిగతా సినిమాలు అన్నీ చెడు అనుభవాలను మిగిల్చాయి.


ఏప్రియల్ నెల ఎంటర్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈనెల పై ఉంది. వాస్తవానికి ఈ నెలలో విడుదల కావలసి ఉన్న భారీ అంచనాలు ఉన్న ‘ఘాటీ’ ‘కన్నప్ప’ సినిమాలు వాయిదా పడటంతో క్రేజీ హీరో సిద్దూ జొన్నల గడ్డకు జాక్ పాట్ తగిలినట్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 10 సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’ విడుదల కాబోతోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈమూవీ పై బాగా అంచనాలు ఉన్నాయి.


అదేరోజు అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విడుదల కాబోతోంది. ఈమూవీ తరువాత రెండు సంవత్సరాలు బ్రేక్ తీసుకునే అవకాశం ఉంది అంటూ వార్తలు వతున్నాయి. ఈమూవీ విడుదలైన మొదటిరోజు ఏప్రిల్ 11 యాంకర్ ప్రదీప్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ రాబోతోంది. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా టైటిల్ ను తన సినిమాకు అనుకూలంగా ప్రదీప్ ఉపయోగించుకుంటున్నాడు.  


ఆతరువాత ఇదే నెలలో ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ విడుదలకాబోతోంది. అయితే ఈమూవీకి టోటల్ పాజిటివ్ టాక్ వచ్చినపుడు మాత్రమే ఈ మూవీ విజయవంతం అయ్యే ఆస్కారం ఉంది.  ‘కన్నప్ప’ తప్పుకోవడంతో దాని స్థానంలో రావాలనుకున్న ‘భైరవం’ ఏప్రిల్ 25 వచ్చే సూచనలు ఉన్నాయి అంటున్నారు. ఈ సినిమాలు కాకుండా ఈనెలలో ‘చౌర్య పాఠం’ ‘28 డిగ్రీస్ సెల్సియస్’ ‘లవ్ యువర్ ఫాదర్’  ‘ఎర్రచీర’ లాంటి సినిమాలు వస్తున్నాయి. అయితే ఈ చిన్న సిమాలపై ఎటువంటి క్రేజ్ లేకపోవడంతో ఎలా చూసిన సిద్దూ జొన్నల గడ్డకు పరిస్థితులు అనుకూలించేల కనిపిస్తున్నాయి. దీనితో ఈనెల విజేత ఎవరు అంటూఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: