
సుమారుగా ఏడేళ్ల పాటు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలిగిన సిమ్రాన్ ప్రముఖ డాన్స్ మాస్టర్ రాజా సుందర్ తో కూడా ప్రేమలో పడిందనే విధంగా అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక తన ప్రేమను పెళ్లిగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో వీరిద్దరూ విడిపోవడం జరిగిందట. అది కూడా ఒక లిప్ లాక్ కిస్ కారణంగానే వీరిద్దరు విడిపోయారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక కమలహాసన్ తో కలిసి నటించిన సిమ్రాన్ ఒక సినిమాలో కమలహాసన్ కి లిప్ లాక్ సన్నివేశంలో నటించిందట.
దీంతో అటు కమలహాసన్, సిమ్రాన్ మధ్య ఏదో ఉన్నట్లుగా రూమర్లు వినిపించాయి. ఈ విషయం విన్న డాన్స్ మాస్టర్ రాజాసుందరం కూడా సిమ్రాన్ ను కమలహాసన్ కి దూరంగా ఉండమని చెప్పారట. కానీ సిమ్రాన్ వినకపోవడంతో వీరిద్దరికి బ్రేకప్ జరిగిందని వార్తలు వినిపించాయి. అయితే ఆ తరువాత ఈ బాధతో కొన్నేళ్లపాటు సిమ్రాన్ ఇబ్బంది కూడా పడిందని దీనివల్ల సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయని రూమర్స్ వినిపించాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది..ఆ తర్వాత కొద్ది రోజులకు దీపక్ బగ్గ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది.ప్రస్తుతం ఈమె అడపా దడపా చిత్రాలలో నటిస్తూ పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నది.