మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి పరిచయమైన ఈ హీరో తన సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. రామ్ చరణ్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. అందులో కొన్ని సినిమాలు సక్సెస్ అవగా మరికొన్ని సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయినప్పట్టికి రామ్ చరణ్ హిట్లు ఫ్లాప్లు అనే తేడా లేకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటారు. 

రామ్ చరణ్ రీసెంట్ గా నటించిన గేమ్ చేంజర్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అనంతరం ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం "పెద్ది". ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక పెద్ది మూవీ టీమ్ తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ ను అనౌన్స్ చేశారు. పెద్ది సినిమాకు ఏ ఆర్ రెహమాన్ అందిస్తున్న ఆడియో రైట్స్ ను టీ-సిరీస్ రూ. 35 కోట్లకు దక్కించుకున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించారు. 


ఏ ఆర్ రెహమాన్ గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోయే మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. కాగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని రామ్ చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది. తెలుగులో జాన్వి నటించబోయే రెండవ సినిమా ఇదే కావడం విశేషం. 

ఈ చిన్నది తెలుగులో నటించిన మొదటి సినిమా దేవర మంచి సక్సెస్ అందుకోవడంతో జాన్వి కపూర్ కు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు క్యు కడుతున్నారు. ఇక ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో మరిన్ని సినిమా అవకాశాలను అందుకోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. కాగా  రాంచరణ్ పెద్ది సినిమాలో మరో హీరోయిన్ ను కూడా తీసుకుంటారని సమాచారం. ఆమె సైడ్ హీరోయిన్ అని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: