మ్యాడ్ 2 ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదలైన మొదటి షో తోనే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. మొదటి షో తోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2023 అక్టోబర్ 6వ తేదీన విడుదలైన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా మాడ్ స్క్వేర్ సినిమాను తీశారు. అయితే ఈ సినిమాలో కామెడీ, ఫ్రెండ్షిప్, లవ్, ఎంటర్టైన్మెంట్ వంటి అంశాలతో ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. 



ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసిందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా విడుదలైన అతి తక్కువ సమయంలోనే భారీగా కలెక్షన్లను రాబట్టింది. కాగా, మ్యాడ్ స్క్వేర్ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు.


సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ లు కీలకపాత్రలను పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్ శ్రీకర స్టూడియో, ఫార్చునర్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మ్యాడ్ స్క్వేర్ సినిమాకు భీమ్స్ సిసిరోలియో పాటలు, తమన్ సంగీతాన్ని అందించారు.

కాగా, ఈ సినిమా విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే 69.4 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు యూత్ ఎంతగానో కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే ఎక్కువ కలెక్షన్లు రాబట్టి మంచి సక్సెస్ సాధించింది. కాగా ఈ సినిమా ఇంతవరకు రాబట్టిన కలెక్షన్లను మ్యాడ్ స్క్వేర్ చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: