జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు అందుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ తన నటన, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగాడు. అనంతరం ఎన్టీఆర్ దేవర సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.


ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా వల్ల నిర్మాతలు భారీగా లాభపడ్డారు. ఇక దేవర సినిమాకు సీక్వెల్ గా దేవర పార్ట్ 2 ను త్వరలోనే తీయాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే దేవర సినిమాకు గాను ఎన్నో అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉగాది సందర్భంగా చెన్నైలో శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ అవార్డు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో దేవర సినిమాకు గాను బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు రావడం గమనార్హం.

కాగా, ఈ విషయాన్ని దేవర సినిమా ఫోటోగ్రఫీ డైరెక్టర్ రత్న వేలు తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం రత్నవేలు అవార్డు అందుకుంటూ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో దేవర చిత్ర బృందం సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, ఇటీవలే దేవర సినిమా జపాన్ లో కూడా రిలీజ్ అవగా మంచి సక్సెస్ అందుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ కు అభిమానులు ఉండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం రత్న వేలు మెగా హీరో రాంచరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమాకు DOP గా పనిచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: