మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ నేను శైలజ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్సినిమా అనంతరం ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన నటన, అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ చిన్నది ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. దాదాపు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కలిసి సినిమాలు చేయడం విశేషం.


ప్రస్తుతం కీర్తి సురేష్ హిందీలో కూడా సినిమాలు చేసుకుంటూ పోతోంది. తెలుగు, హిందీ మాత్రమే కాకుండా వివిధ భాషలలో సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది. కీర్తి సురేష్ రీసెట్ గానే తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ ను కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. చాలా కాలం నుంచి ఈ ప్రేమలో ఉన్న ఈ జంట కొద్ది రోజుల క్రితమే వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీరు హిందూ క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు. కీర్తి, ఆంటోనీల వివాహానికి సినీ ప్రముఖులు అందరు విచ్చేసి సందడి చేశారు.

ఇక వివాహం తర్వాత కీర్తి సురేష్ ఎప్పటిలానే వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం కీర్తి సురేష్ కీర్తి హిందీలో అక్క, రివాల్వర్ రీటా వంటి సినిమాలు చేస్తోంది. అంతేకాకుండా కీర్తి సురేష్ తన తదుపరి సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే రణబీర్ కపూర్, కీర్తి సురేష్ కోసం సినిమా కథను పూర్తి చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కాస్త ఎక్కువగా ఉండనున్నట్లుగా సినీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ఈ సినిమా కథను చాలా ప్రత్యేకంగా రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: