ఏంటి రాజీవ్ కనకాల పేకాట మత్తులో ఆ నటుడి కి 350 కోట్ల అప్పు ఇచ్చారా.. లేక అప్పు తీసుకున్నారా.. ఇంతకీ రాజీవ్ కనకాలకు పేకాట ఆడే చెడు వ్యసనం కూడా ఉందా.. అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది హీరోలకు నటీనటుల కు రకరకాల అలవాట్లు ఉంటాయి. అలా అమృతం సీరియల్ ద్వారా ఫేమస్ అయినటువంటి హర్షవర్ధన్ రాజీవ్ కనకాల ఇద్దరికి కూడా పేకాట ఆడే వ్యసనం ఉండేదట.అయితే ఈ విషయం గురించి రీసెంట్గా పాడ్ కాస్ట్ లో హర్షవర్ధన్ మాట్లాడారు. అయితే గతంలో మీరు తిండి నిద్రాహారాలు మానేసి రెండు రోజులపాటు ఆ పని చేశారట కదా అది నిజమేనా అని యాంకర్ హర్షవర్ధన్ ని అడగగా..ఈ విషయం ఒక రాజీవ్ కనకాలకు తప్ప ఎవరికీ తెలియదు. అలాంటిది రాజీవ్ కనకాల బయటపెట్టారంటే ఆయన్ని ఇరికించేలా నేను కూడా మరో విషయం బయట పెట్టాలి. 

అసలు విషయం ఏమిటంటే..మా ఇద్దరికీ అవకాశాలు లేక ఖాళీగా ఉన్న టైంలో ఇద్దరం పేకాట ఆడడం స్టార్ట్ చేసాం.అలా చివరికి అది మాకు వ్యసనంగా మారింది. రాత్రి 8 గంటలకు పేకాట ఆడటం మొదలుపెడితే ఉదయం 3 గంటల వరకు పేకాట నుండి లేచే వాళ్ళం కాదు.ఇక మా ఆట చూసి చాలా మంది ఫ్రెండ్స్ అసలు మీరు కూర్చున్న దగ్గరి నుండి లేస్తున్నారా.. తింటున్నారా.. కనీసం బాత్రూం కైనా వెళ్తున్నారా.. స్నానం చేస్తున్నారా అని షాక్ అయిపోయారు. ఆ టైంలో 5 పైసలతో మేం పేకాట ఆడడం స్టార్ట్ చేసాం. కానీ చివరికి అది కోట్ల వరకు వెళ్ళింది. అలా ఆడి ఆడి నేను లాస్ అయ్యి రాజీవ్ కనకాల దగ్గర 350 కోట్ల అప్పు తీసుకున్నాను అంటూ హర్షవర్ధన్ సంచలన విషయం బయటపెట్టారు. 

అయితే హర్షవర్ధన్ మాట్లాడిన మాటల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ లెక్కన రాజీవ్ కనకాల అన్ని కోట్లు సంపాదించారా అని చాలామంది షాక్ అయిపోతున్నారు. అంతేకాదు అసలు పేకాట ఆడడం కోసం ఎవరైనా 350 కోట్లు ఖర్చు పెడతారా అని కామెంట్లు పెడుతున్నారు. అయితే హర్షవర్ధన్ రాజీవ్ కనకాలను ఇరికించడం కోసం అలా ఒక ఫన్నీ విషయాన్నీ బయట పెట్టారు కావచ్చు అని ఇంకొంతమంది అనుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికీ హర్షవర్ధన్ చెప్పిన దాంట్లో ఉన్న నిజమెంతో తెలియదు కానీ రాజీవ్ కనకాల పేకాట ఆడుతారు అంటూ చాలామంది సోషల్ మీడియాలో దీన్ని ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: