- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )


సమంత.. ఎన్నో వివాదాలు, విషాదాలు, అక్కినేని నాగచైతన్యకు విడాకులు.. కొంతకాలం క్రితం.. రోజు పెద్ద వార్తగా ఉండేవి. తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి భాదించటంతో చాలా ఇబ్బంది పడ్డారు. ఇక తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరో వివాదం. మొత్తానికి ఎప్పుడు సమంత వార్తలతో తెరమీద నానుతుంది. కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత కూడా ఆచితూచి చాలా పరిణీతితో స్పందించింది. సమంత జీవనశైలి చాలామందికి నచ్చకపోవచ్చు.


అవన్నీ అలా వదిలేస్తే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమంత ఓ ప్రోగ్రాం లో మాట్లాడుతూ చేసిన కామెంట్లు ఆమె తత్వాన్ని వెల్లడిస్తున్నాయి. తను చైతుతో వివాహ బంధాన్ని పెంచుకోవడానికి చాలా కారణాలు బయటకు తెలియనివి ఉన్నాయి. కానీ.. ఇప్పుడు ఆమె చెబుతున్నది చూస్తే అందుకు ఆమె జీవన దృక్పథం కూడా ఓ కారణం అనుకోవాలి. సక్సెస్ అంటే గెలవడం మాత్రమే కాదు.. ప్రయత్నించడం ముఖ్యం. కానీ.. గెలిస్తేనే సక్సెస్ కాదు. అవార్డులు, రివార్డులు ఇవన్నీ సక్సెస్ కాదు.


మనకు నచ్చినట్లు జీవించడం, జీవించగలగటం అన్నది నిజమైన సక్సెస్. నా జీవితంలో నాకు నచ్చినట్టు బతకాలని అనుకుంటాను. నియ‌మ నిబంధనలు నాకు నచ్చవు. ఆడపిల్ల కాబట్టి ఇది చేయకూడదు.. అది చేయకూడదు.. అని ఆంక్షలు విధిస్తే నాకు నచ్చదు. ఇవి ఆమె చేసిన వ్యాఖ్యలు. సక్సెస్ అంటే సమంత చెప్పింది చాలా వరకు నిజం అనుకోవచ్చు. అది అందరికీ సాధ్యం కాదు. పెళ్లయ్యాక ఆమె కొన్నాళ్లు సినిమాలు చేయలేదు. ఆహా ఓటీటీలో ఏదో షో చేసింది. తన నట జీవితం ఇక ముగిసిపోయినట్టేనా అన్న భావన ఆమెను కలవరానికి గురిచేసింది. అలా ఓ చోట కట్టేసినట్టు.. తాను బందీ అయిపోయినట్టుగా అక్కినేని కుటుంబంలో ఉండలేకపోయింది.


తనకు స్వేచ్ఛ కావాలి.. తాను అనుకున్నది చేయగలగాలి.. అందుకొనేమో చూసి చూసి చివరకు వదిలేసింది. నాగచైతన్యతో బంధాన్ని తెంచుకుంది. తర్వాత వెబ్ సిరీస్‌లో బోల్డ్ గా నటించింది. పుష్పలో ఐటెం సాంగ్, శకుంతలం, య‌శోధ‌ లాంటి సినిమాలు చేసింది. అయితే విడాకుల తర్వాత తన సినిమాలోవి సక్సెస్ కాలేదు. సిటాడెల్‌ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ చేసింది పర్లేదు. ఇప్పుడు తనే నిర్మాతగా మారింది. శుభం అనే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది. ఓ దశలో టాప్‌ పెయిడ్.. మస్తు గిరాకీ ఉన్న హీరోయిన్ ఆమె. ఇప్పుడు ఓ మామూలు నటి. ఆమె చెప్పుకుంటున్న తీరును బట్టి ఆమె జీవితంలో తనకు తానుగా స్వేచ్ఛగా జీవించగలగాలి అన్న ఆలోచనతో ఉంది. ఇది అక్కినేని కుటుంబంలో సాధ్యం కాదు అని అర్థమయ్యాక.. ఆమె ఆ కుటుంబానికి దూరమైనట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: