
లేడీస్ నైట్ అనే సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఈ సినిమా విడుదల కావడం ఆలస్యం అవ్వడంతో హీరో శ్రీ విష్ణు నటించిన సామజవరగమన అనే చిత్రంలో కూడా నటించి మంచి విజయాన్ని అందుకుంది. అలా వరుస సినిమాలలో నటించిన రెబా మోనికా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది. కెరియర్ ప్రారంభంలో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అంటూ వెల్లడించింది.
ఆఫర్స్ కోసం తిరుగుతున్న సమయంలో కొంత మంది తనను కమిట్మెంట్ అడిగారంటూ వెల్లడించింది. మరి కొంతమంది తనను డేటింగ్ కి వస్తావా అంటూ డైరెక్ట్ గా ముఖం మీదే అడిగేవారంటు వెల్లడించింది రెబా మోనికా. తెలుగు, తమిళ్ ,మలయాళం వంటి భాషలలో కూడా నటిస్తు బిజీగానే ఉన్నది.రెబా మోనికా చేసిన ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కూలి, జననాయగన్ వంటి చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నది. ఇటీవలే విడుదలైన మ్యాడ్ స్క్వేర్ లో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ. మరి రాబోయే రోజుల్లో తిరిగి మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు.