డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ అంటే తెలియని వారు ఉండరు.. అష్టాచమ్మా, గ్రహణం, సమ్మోహనం, జెంటిల్మెన్, వి, మాయాబజార్,గోల్కొండ హై స్కూల్ వంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన ఇంద్రగంటి మోహనకృష్ణ తాజాగా సారంగపాణి జాతకం అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి నటిస్తున్నారు. అయితే ఈ మధ్యనే కోర్టు వంటి భారీ హిట్ తో వచ్చిన ప్రియదర్శి మరోసారి సారంగపాణి జాతకం సినిమాతో రావడంతో ఈ సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి. ఇక సారంగపాణి జాతకం మూవీ ఏప్రిల్ 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ డైరెక్టర్ అయినటువంటి ఇంద్రగంటి మోహనకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ఓ నటుడి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆ నటుడు నాతో సెక్స్ చేస్తా అన్నాడు అంటూ ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే.. అవసరాల శ్రీనివాస్ నాతో కలిసి సినిమాలు చేసిన ప్రతిసారి కొన్ని అడల్ట్ జోకులు వేసేవారు.అయితే ఈ విషయాన్ని ఇప్పుడు ఈ అందరి ముందు చెప్పాలో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే చెప్పాలి అనుకుంటున్నాను. అవసరాల శ్రీనివాస్ ప్రతిసారి నాతో సెక్స్ చేయాలని ఉంది అని అనేవాడు.అయితే ఆయన మాటలు నాకు అర్థం కాక ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకునేవాడిని. కానీ ఆ తర్వాతే ఆయన మాటల్లో ఉన్న అంతరార్థం అర్థమైంది.ఆయన నాతో అలాంటి పని చెయ్యాలి అన్నాడు అంటే అది నేను అనుకుంటున్నట్టు వేరే ఏదో కాదు.

నాతో కలిసి ఆయన సెట్ లో వర్క్ చేయాలి అని అనుకున్నారు. ఆ విషయాన్ని నాతో అడల్ట్ జోకేసి చెప్పారు. ఇక ఆయన మాటలు అర్థం చేసుకున్న నేను ఆయనతో సెట్ లో చాలా సరదాగా వర్క్ చేసేవాడిని. ఆయనతో వర్క్ చేయడం బాగా అనిపించింది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట వల్ల చాలామంది యూట్యూబర్స్ కి, వెబ్సైట్స్ వాళ్ళకి థంబ్ నెయిల్స్ దొరికేసిందని నాకు అర్థమైంది. అయితే ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పిన ఈ మాటల పట్ల అవసరాల శ్రీనివాస్ అక్కడే ఉండి కాస్త ఇబ్బందికరంగా ఫేస్ పెట్టడం గమనార్గం. ఏది ఏమైనప్పటికీ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడిన మాటలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: