
మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రావింకూడు షప్పు సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 11 నుండి సోని లివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా మలయాళంతో పాటుగా తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 16న రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ప్రావింకూడు షప్పు మూవీలో షోబిన్ షాహిర్, బాసిల్ జోసఫ్, వినోద్ జోస్ ముఖ్య పాత్రలో నటించారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల లిస్ట్ చూద్దాం. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా సినిమా జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రీతూవర్మ నటించింది. షాహిద్ కపూర్ నటించిన దేవ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన ఈ సినిమా నేటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. స్టార్ హీరో ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్దం సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఆడుతుంది. తమిళ హీరో జీవ నటించిన అగత్య సినిమా సన్ నెక్స్ట్ లో ప్రసారమవుతుంది.