తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం బాలీవుడ్ ని కూడా బీట్ చేసేసింది. మంచి మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకి తీసుకోస్తూ.. హిట్ లను కొట్టి భారీ బడ్జెట్ ను సంపాదిస్తుంది. అయితే ఈ ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలతో కలిపి మొత్తంగా 60కి పైగా సినిమాలు విడుదల అయ్యాయి. కానీ అందులో కొన్ని సినిమాలు హిట్ టాక్ ని సొంతం చేసుకోగా.. మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఏమో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇందులో కొన్ని స్ట్రెయిట్ తెలుగు సినిమాలు అయితే.. మరికొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ మూడు నెలలలో వచ్చిన సినిమాలలో మంచి సక్సెస్ పొందిన సినిమాలు ఏవో చూద్దాం.

మొదటి నెలలో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో హీరోయిన్లు గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి హిట్ అయ్యి.. రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను దాటింది. అలాగే బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ సినిమా కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా రూ. 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది.

 
ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయిన తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో లేడి పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రూ. 100 కోట్ల కలెక్షన్స్ ని సంపాదించింది. మార్చి నెలలో రిలీజ్ అయిన కోర్ట్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా రూ. కోటికి పైగా వసూలు చేసింది. అలాగే ఇటీవలే రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా మంచిగా దూసుకెళ్తుంది. ఈ సినిమా ఇప్పటికే రూ. 55 కోట్లు దాటింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: