తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం బాలీవుడ్ ని కూడా బీట్ చేసేసింది. మంచి మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకి తీసుకోస్తూ.. హిట్ లను కొట్టి భారీ బడ్జెట్ ను సంపాదిస్తుంది. అయితే ఈ ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలతో కలిపి మొత్తంగా 60కి పైగా సినిమాలు విడుదల అయ్యాయి. కానీ అందులో కొన్ని సినిమాలు హిట్ టాక్ ని సొంతం చేసుకోగా.. మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఏమో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇందులో కొన్ని స్ట్రెయిట్ తెలుగు సినిమాలు అయితే.. మరికొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ మూడు నెలలలో వచ్చిన సినిమాలలో ఫ్లాప్ అయిన సినిమాల లిస్ట్ చూద్దాం.

మొదటి నెలలో మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాకి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, తెలుగు అమ్మాయి అంజలి హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయిన విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా, బ్రహ్మానందం నటించిన బ్రహ్మానందం సినిమా, రామం రాఘవం, మజాకా, శబ్దం, బాపు సినిమాలు అంతా అంతా మాత్రంగా ఆడాయి. అలాగే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కూడా రిలీజ్ అయ్యి పర్లేదు అనిపించింది.  


మార్చి నెలలో రిలీజ్ అయిన నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతోపాటుగా మోహన్ లాల్ నటించిన L2: ఎంపురాన్ సినిమా అంతగా హిట్ అందుకోలేకపోయింది. విక్రమ్ నటించిన వీర ధీర సూర సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్ మాత్రం ఎక్కువగా కాలేదు. దిల్ రూబా, ఛావా సినిమాలు కూడా అంతగా హిట్ కొట్టలేకపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: