అలనాటి అందాల తార సదా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది ఒకానొక సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీని తన సినిమాలతో ఓ ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. సదాకు విపరీతంగా అభిమానులు ఉండేవారు. తన అందం, నటనకు ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు. కాగా, ఈ చిన్నది ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తన అద్భుతమైన నటన, అందచందాలకు గాను ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. కాగా ఈ చిన్నది కొన్ని సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీని తన సినిమాలతో ఓ రేంజ్ కి తీసుకెళ్ళిందని చెప్పవచ్చు.

సదా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ సినిమాలలోనూ నటించి మంచి గుర్తింపు అందుకుంది. 2002 సంవత్సరంలో జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు అందుకుంటుంది. సదా హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించింది. ఇప్పుడు కేవలం అక్క, వదిన వంటి పాత్రలలో మాత్రమే చేస్తుంది. ఇతర భాషలలో ఇప్పటికీ హీరోయిన్ గా సదా సినిమాలు చేస్తుండడం విశేషం. కాగా ఈ చిన్నదాని వయసు 41 సంవత్సరాలు. అయినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. వయసు పెరిగినప్పటికీ అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. 


సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది విపరీతంగా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొన్ని షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం సదాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారింది. సదా సినిమాలలో నటిస్తున్న సమయంలో కొంతమంది హీరోలతో నిర్మాతలతో ఎఫైర్లు కొనసాగించినట్లుగా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సదా ఇప్పుడు ఓ నిర్మాతతో సహజీవనం చేస్తుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆ నిర్మాతతో రిలేషన్ కొనసాగిస్తుందని, వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: