ప్రతి సంవత్సరం టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఏ సినిమా అయిన ప్రేక్షకులను అలరించడానికే రూపొందిస్తారు. అయితే అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతాయి.. మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమవుతాయి. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే.. ఈ మధ్య కాలంలో తెలంగాణ యాసలో చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాగే గొప్ప హిట్లను కూడా అందుకుంటున్నాయి. అయితే 2024లో తెలంగాణ యాసలో తెరపైకి వచ్చిన చెప్పుకోదగ్గ సినిమాలు ఏవో చూద్దాం.

ఇకపోతే 'రజాకార్' సినిమా తెలంగాణ ప్రాంతంలో రజాకార్ వ్యవస్థపై జరిగిన అరాచకాల చూపిస్తుంది తీసిన సినిమా ఇది. రజాకర్ సినిమా దర్శకుడు యాట సత్యనారాయణ. ఈ సినిమా కూడా మంచి టాక్ తో దూసుకెళ్లింది. అలాగే, అనన్య నాగళ్ల మెయిన్ రోల్ లో నటించిన పొట్టేల్ మూవీ కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.

 
అంతేకాకుండా జితేందర్ రెడ్డి, కేశవ చంద్ర రమావత్ ఉరుకు పటేలా, లైన్ మాన్, కళ్లు కాంపౌండ్, ప్రవీణ్ ఐపీఎస్, పైలం పిలగా, షరతులు వర్తిస్తాయి, గొర్రెపురాణం, బహిర్ భూమి సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి.. కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. ఇక ఈ సినిమాలు అన్నీ తెలంగాణ నేపథ్యంలో వచ్చిన కథనాలే. ఇక 2025లో కూడా తెలంగాణ నేపథ్యంలో మరిన్ని హిట్ సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇక ఈ ఏడాది సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించిన 'బాపు సినిమా' కూడా తెలంగాణ యాసలోనే తెరకెక్కిన సినిమా. ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంత చేసుకుంది. ఈ సినిమాకు డైరెక్టర్ దయాకర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ ఆమని, ధన్య బాలకృష్ణ, బలగం సుధాకర్ రెడ్డి, మణి, రచ్చ రవి ముఖ్య పాత్రలలో కనిపించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: