ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ శోభన గురించి ఆమె అందం గురించి అభినయం గురించి చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తన ఖాతాలో వేసుకున్న ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా చెరగని ముద్ర వేసుకుంది. విక్రమ్ చిత్రంతో మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమైనా శోభన నాగార్జున మొదటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక తర్వాత అటు బాలయ్యతో పెట్టు చిరంజీవి, వెంకటేష్, మోహన్ బాబు తదితర హీరోలతో కూడా నటించింది.



శోభన తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, మలయాళం వంటి భాషలలో కూడా నటించింది. మలయాళంలో చంద్రముఖి చిత్రంలో అద్భుతమైన పాత్రలో నటించి అవార్డును కూడా సంపాదించుకున్నది. శోభన హీరోయిన్ కాకముందే డాన్సర్ గా నేషనల్ వైట్ గా ఎన్నో పర్ఫామెన్స్ లు కూడా చేసిందట. ఇప్పటికే ఆమె వివాహం చేసుకోకుండా ఒంటరిగానే తన జీవితాన్ని గడిపేస్తున్నారు. హీరోయిన్ శోభనకి 55 ఏళ్ళు అవుతూ ఉన్న ఇప్పటికి వివాహం చేసుకోకుండా ఉన్నది. అయితే అందుకు కారణం ఒక హీరో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.



అయితే అప్పట్లో శోభన ఒక హీరోను ఇష్టపడిందని అయితే అతడినే వివాహం చేసుకోవాలని ఆశపడిన ఆ హీరోకు వెళ్లి ఇదే విషయాన్ని చెప్పక ఆ హీరో నో అని చెప్పాడట. దీంతో ఆమెకు పెళ్లి, ప్రేమ మీద విరక్తి వచ్చిందని అందుకే వివాహం చేసుకోకుండా ఒంటరిగా తన జీవితాన్ని సైతం గడిపేస్తూ ఉన్నదట. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ సోషల్ మీడియాలో శోభన గురించి మాత్రం ఈ విషయం వైరల్ గా మారుతున్నది. ఇప్పటికీ శోభన పలు చిత్రాలలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలో నటిస్తూ నేర్పిస్తూ ఉన్నది. కల్కి సినిమాలో కూడా నటించింది. సీక్వెల్లో కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: