
ఇప్పటివరకు ఈ దర్శకుడు తన వ్యక్తిగత విషయాలు మీడియాకు షేర్ చేయలేదు. ఇలాంటి నేపధ్యంలో ఈ దర్శకుడు తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. తనది మధ్యతరగతి కుటుంబం అనీ తన కుటుంబంలో తానే పెద్ద అని చెపుతూ తన చెల్లికి పెళ్లి చేయడం తమ్ముడుని సెటిల్ చేయడం లాంటి బాధ్యతలు తనకు చాల ఎక్కువగా ఉండటంతో ఈ బాధ్యతలు మధ్య తనకు పిల్లలు వద్దు అని భావించి తన భార్య అంగీకారం తీసుకుని తాను పిల్లలను త్యాగం చేశానని తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడుసార్లు గెలవడానికి ఆయనకు పిల్లలు లేకపోవడం వల్ల ఎలాంటి బాదరబందీ లేకుండా నిస్వార్థంగా ఉండగలుగుతున్నారని పిల్లలు ఉంటే స్వార్థం ఎక్కువగా ఉంటుంది అంటూ హరీష్ శంకర్ అభిప్రాయ పడుతున్నాడు. తన భార్యకు సినిమాల పట్ల పెద్దగా ఆశక్తి లేదనీ తన సినిమా కబుర్లన్నీ ఆఫీస్ సినిమా సెట్స్ లోనే ముగిసిపోతాయని అంటూ తనకు ఎంత పారితోషికం వస్తుంది అన్న విషయం కూడ తన భార్యకు తెలియదు అంటున్నాడు.
అంతేకాదు ఆమధ్య తన తండ్రి బోర్ ఫీల్ అవుతున్నాడు అంటూ ఆయనకు ఒక ల్యాప్ టాప్ కొని ఇస్తే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీ గురించి ముఖ్యంగా తన గురించి వచ్చే గాసిప్ వార్తలు చదివి తనతో టెన్షన్ పడిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు..
.