
అనంతరం వీరిద్దరూ కలిసి కూడా డాన్స్ వేయడం జరిగింది .అందుకు సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో హైలెట్గా మారాయి. అయితే తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ తో బ్రేకప్ అయ్యిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే వీరిద్దరూ ఎక్కడా మల్లి కలిసి కనిపించలేదని విధంగా వార్తలు వినిపించాయి. కానీ ఇటీవలే జరిగిన హోలీ వేడుకలలో మాత్రం అటు తమన్నా, విజయ్ ఇద్దరు కూడా సపరేట్ గానే రషా ఇంట వేడుకలకు హాజరయ్యారు.
అయితే ఇప్పుడు తాజాగా ముంబైలో అమ్మవారి పూజ వీడియో వైరల్ గా మారుతున్న సందర్భంలో తమన్నా, బాయ్ ఫ్రెండ్ విజయ్ మాత్రం అసలు కనిపించలేదు. దీంతో వీరిద్దరూ బ్రేకప్ వార్తలు నిజం అనేలా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయపైన ఇప్పటివరకు ఈ జంట ఏ విధమైనటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. తమన్నా సినిమాల విషయానికి వస్తే ఓదెల 2 సినిమాలో ప్రస్తుతం నటిస్తూ ఉన్నది. ఈ చిత్రంలో ఈ అమ్మడు ఒక నాగ సాధువుగా కూడా కనిపించబోతున్నది. డైరెక్టర్ అశోక్ దర్శకత్వంలో ఈ సినిమా ఏప్రిల్ 17 తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. మొదటిసారి ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్న తమన్నా మరి ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి మరి.