మనం ఏ ఫీల్డ్ లో ఉన్న వాటన్నింటినీ శాసించేది రాజకీయం మాత్రమే. రాజకీయ నాయకులు ఏది చేయాలనుకుంటే అది ఈజీగా చేయగలుగుతారు. అలాంటి రాజకీయ నాయకుల జోలికి సాధారణంగా ఇతర ఫీల్డ్ లో ఉన్నవారు అస్సలు వెళ్ళరు.. ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి తారలు రాజకీయ విషయాలలో అసలు జోక్యం చేసుకోరు. కానీ తాజాగా హీరోయిన్ సమంతా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషయంలో కాస్త వేలు పెట్టి గెలికింది.. ప్రభుత్వం చేస్తున్న ఒక పనికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడింది. మరి ఆమె ఏమన్నది వివరాలు చూద్దాం..ఆ మధ్యకాలంలో సమంత విడాకుల ఇష్యూ గురించి మంత్రి కొండా సురేఖ మాట్లాడడంతో వివాదం చెలరేగింది. సమంత నాగచైతన్య విడిపోవడానికి కారకులు కేటీఆర్ అంటూ మాట్లాడింది.

 వాళ్లు ఫోన్ ట్యాప్ చేసి వారిద్దరి విడాకులకు కారణమయ్యారంటూ చెప్పుకోవడంతో ఆ మాటలు వివాదమయ్యాయి. ఇది మర్చిపోతున్న తరుణంలో సమంత మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జోలికి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం హెచ్సియుకు సంబంధించిన భూములను చదును చేస్తోందని సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు విద్యార్థులంతా ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తూ తీవ్రంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇదే తరుణంలో సీనియర్ సినీ ప్రముఖులు రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు ఎవరు కూడా ఈ ఇష్యుపై స్పందించలేదు. కానీ తాజాగా సమంత మాత్రం ఎస్సీ, భూముల విషయంలో స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టింది.

 ఓవైపు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా కానీ అడవి ప్రాంతంలో నలబై బుల్డోజర్స్ తో చెట్లను తొలగిస్తున్నారని సమంత పోస్ట్ చేసింది. అడవులను నిర్లక్ష్యం చేస్తే ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఎన్నో వన్యప్రాణులకు ఆవాసంగా ఉండే ఈ అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన పోస్ట్ చూసినటువంటి కొంతమంది  ఆమె రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోస్ట్ పెట్టిందని కామెంట్లు పెడుతున్నారు. సమంత పెట్టిన పోస్ట్ కు ఎంత మంది సినీ ప్రముఖులు బాసటగా నిలబడతారో ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: