
మనకు తెలిసిందే ఈ సినిమా మొత్తం స్పోర్ట్స్ డ్రామా ఆధారంగా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ వేరే లెవెల్ లో ఉండబోతున్నాయి అంటూ రిలీజ్ అయిన అప్డేట్ ఆధారంగా తెలుస్తుంది. చాలామంది ఈ సినిమాలో రాంచరణ్ లుక్స్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరి ఉన్నాయి అంటూ ట్రోల్ చేశారు . కానీ ఆ క్యారెక్టర్ వేరు అని ఈ క్యారెక్టర్ వేరు అని సినీ మేకర్స్ ద్వారా వచ్చింది ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్ నటిస్తుంది .
జాన్వి కపూర్ కి ఇది రెండవ సినిమా. "దేవర" సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది . అయితే ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేకపోయింది . ఈ సినిమాతో అయినా జాన్వి కపూర్ హిట్ పడుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన ఆనందమే ఆమెకిఉండదు అంటూ తేలిపోయింది . ఈ సినిమాలో మరొక హీరోయిన్ గా యాడ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారట మెకర్స్.
ఈ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యారెక్టర్ కోసం మీనాక్షి చౌదరిని హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మీనాక్షి చౌదరి ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. అలాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తే కచ్చితంగా జాన్వి కపూర్ క్యారెక్టర్ ని జనాలు పెద్దగా ఎంకరేజ్ చేయకపోవచ్చు అని .. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి క్యారెక్టర్ హైలెట్ అయిపోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా హైలెట్ గా ట్రెండ్ అవుతుంది..!!