టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కల్కి సినిమాలో ప్రభాస్ కు జోడీగా దిశా పటానీ నటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లో సైతం దిశా పటాని నటించనున్నారని వార్తలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
 
ప్రభాస్ దిశా పటానీ జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఫౌజీ అనే సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో దిశా పటానీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.
 
త్వరలో దిశాపటానీ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉంది. ఫౌజీ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి స్పష్టత రావాల్సి ఉంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫౌజీ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
 
ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్ ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలలో నటిస్తున్నారు. ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ హీరో  ప్రభాస్ ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టించి అభిమానులకు మరింత దగ్గర కావాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


 
 


మరింత సమాచారం తెలుసుకోండి: