సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల మధ్య, ఇద్దరు హీరోయిన్ల మధ్య లేదా డైరెక్టర్ హీరో మధ్య,డైరెక్టర్ హీరోయిన్ మధ్య, నిర్మాత డైరెక్టర్ మధ్య ఇలా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క సెలబ్రిటీ మధ్య ఏదో ఒక విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. కానీ కొంతమందికి మాత్రం కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్తాయి. అలా ఇప్పటికే ఎంతోమంది హీరోల మధ్య హీరోయిన్ల మధ్య డైరెక్టర్ల మధ్య ఈ వైరం మనం చూసాం. అయితే బాలీవుడ్ లో ఉన్న ఈ హీరోయిన్లు తమ మధ్య ఉన్న శత్రుత్వంతో ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లారు దెబ్బలు కూడా పడ్డారు.మరి ఇంతకీ బాలీవుడ్ లో బద్ధ శత్రువులుగా ఉన్న ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ లో బద్ధ శత్రువులుగా ఉన్న హీరోయిన్లు అనగానే అందరికీ తెరమీద చాలామంది హీరోయిన్ల పేర్లే వినిపిస్తాయి. 

ముఖ్యంగా కరీనాకపూర్,ప్రియాంక చోప్రా, గౌరీ ఖాన్, అలియా భట్,బిపాసా బసూ ఇలా ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తాయి. మరి వీరిలో ఎవరెవరి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కంగనా రనౌత్, అలియాభట్  మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. ఎందుకంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత కంగనా రనౌత్ ప్రత్యక్షంగానే అలియాభట్ పై నెపోటిజం వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక చోప్రా షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. ప్రియాంక చోప్రా తన భర్త షారుక్ తో ఎఫైర్ పెట్టుకుంది అనే అనుమానంతో గౌరీ ఖాన్ ప్రియాంక చోప్రా తో మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. అలాగే అభిషేక్ బచ్చన్ కారణంగా రాణి ముఖర్జీ,ఐశ్వర్య రాయ్ మధ్య కూడా విభేదాలు తలెత్తాయి.

అజ్ నబీ సెట్స్ లో బిపాసా బసూ,కరీనాకపూర్ ఇద్దరు పరస్పరం నిందించుకొని కొట్టుకున్నారు కూడా.. అప్పట్లో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది. అలియా భట్ కి కంగనా రనౌత్ మాత్రమే కాకుండా దివ్య ఖోస్లా కుమార్ తో కూడా విభేదాలు ఉన్నాయి. జిగ్రా మూవీ రిలీజ్ టైం లో ఆలియా పై దివ్య సంచలన ఆరోపణలు చేయడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. బాలీవుడ్ హీరోయిన్స్ అయినటువంటి అమృతారావు ఈశా డియోల్ మధ్య కూడా సఖ్యత లేదు. ప్యారే మోహన్ సినిమా సమయంలో అమృత రావు పై ఈషా డియోల్ చేయి చేసుకుంది.కంగనా రనౌత్ కి తాప్సీ పన్ను తో కూడా విభేదాలు ఉన్నాయి.అలా బాలీవుడ్ లో ఉన్న ఈ హీరోయిన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేంతలా గొడవలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: