సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. సముద్రంలో అలలు ఎలా పడుతూ లేస్తూ పరుగెడతాయో ఆ విధంగానే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు పడిపోతామో ఎప్పుడు లేస్తామో తెలియని పరిస్థితి. ఒక్కోసారి అన్ని బాగున్నా సినిమా ఫ్లాప్ అవుతుంది. ఒక్కోసారి సినిమాలో అంతగా కంటెంట్ లేకపోయినా ఎలాంటి అంచనాలతో రిలీజ్ కాకపోయినా భారీ హీట్ అవుతుంది. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిదని చెప్పవచ్చు. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్లుగా ఉన్నవారు ప్రస్తుతం చాలా బికారి పరిస్థితుల్లో ఉన్నారు.  ఒకప్పుడు ఆఫర్ల కోసం వెతికి వెతికి ఇబ్బందులు పడ్డవారు స్టార్ హోదాలో కొనసాగుతున్నారు. అలా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్డం అందుకున్న నటీనటుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటుడు రాజ్ కుమార్. 

ఆయన దాసరి శిష్యుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు రాజ్ కుమార్ కాస్త చిరంజీవిని పోలి ఉండడంతో ఆయనను బుల్లితెర చిరంజీవి అని కూడా అంటారు. అలాంటి రాజ్ కుమార్ పవన్ కళ్యాణ్ వల్ల తన కెరియర్ పూర్తిగా లాస్ అయ్యారట. అది ఎలాగో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. వివరాలు చూద్దామా.? రాజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బారిష్టర్ శంకర్ నారాయణ అనే చిత్రం గురించి బయటపెట్టారు. ఆ సినిమా చేస్తున్న టైంలోనే పవన్ కళ్యాణ్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయినట్టు తెలియజేశారు. అయితే సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న తరుణంలోనే, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా అకస్మాత్తుగా రిలీజ్ అయిందట. ఈ చిత్రం రిలీజ్ కి ఇంకో నెల రోజుల టైం ఉండడంతో సినిమా ఇంటర్నెట్ లో లీక్ అయిందట. 

దీంతో చిత్ర యూనిట్ వారు హుటాహుటిన సినిమా రిలీజ్ చేశారు. ఇంకేముంది పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ బారిష్టర్ శంకర్ నారాయణ సినిమాపై పడింది. దీనివల్ల ఆ సినిమాను పూర్తిగా నమ్ముకుని రిలీజ్ చేసినటువంటి రాజుకుమార్ కోట్ల రూపాయలు లాస్ అయిపోయారట. చివరికి చేసేదేమీ లేక సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నారట. కానీ తాను వచ్చింది కిందిస్థాయి నుంచే కాబట్టి మళ్లీ పడి లేచిన కెరటంలా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు తన కెరియర్ గాడిలో పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు.  ఈ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: