- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వైవిద్యమైన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర వరస విజయాల తో దూసుకుపోతున్నాడు .. నాని దగ్గర నుంచి సినిమా వస్తుందంటే ఆ మూవీ మినిమం హిట్ అనే టాక్ తెచ్చుకుంది .. ఇప్పటికే నాని నటించిన హాయి నాన్న , సరిపోద్దా శనివారం ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్షన్లో రాబట్టి బాక్సాఫీస్ దగ్గర నానిని కూడా 100 కోట్ల హీరోగా మార్చేశాయి .. అలాగే దసరా సినిమా తో మరో సెన్సేషన్ క్రియెట్‌ చేసిన నాని ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఒదలతో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .. ఇప్పటికే నాని శ్రీకాంత్ ఓద‌ల సినిమా  ది ప్యారడైజ్  మూవీ కి సంబంధించిన టైటిల్ టీజర్ తోనే అభిమానులకు భారీ కిక్ ఇచ్చాడు . ఇదే క్రమం లో ఈ సమ్మర్ కి హిట్‌ 3 సినిమా తో మరోసారి బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాడు నాని ..


సినిమా తో కూడా సాలిడ్ హిట్ పై కన్నేసాడు . అయితే ఇప్పుడు ది ప్యారడైజ్ మూవీ పై హాలీవుడ్ మీడియా తో మాట్లాడుతూ .. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్ థియేటర్లో పండగ చేసుకునే రీతిలో ఉంటుందని ఒక స్క్రీన్ తర్వాత మరొక సీన్ మరొక సీన్ తో ఊహించని మ్యాడ్ ఎనర్జీతో మంచి హైపించే మూమెంట్స్ తో నోర్లు వెళ్ళబెట్టే లా ఉండబోతుందని ఇంతకుమించి ఈ సినిమా కోసం నేనేం చెప్పలేను అంటూ నాని బారీ స్టేట్మెంట్ ఇచ్చాడు.  ఇక‌ ఇప్పుడు నాని చేసిన ఈ స్టేట్మెంట్స్ తో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి . ఇక ఈ సినిమా కి అనిరుద్ సంగీతం అందిస్తుండ గా .. ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే .. అలాగే వచ్చి ఏడాది మార్చ్ 26 న గ్రాండ్ గా  ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురాబోతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: