
ఈ సంక్రాంతి కూడా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది .. ఇప్పుడు వస్తున్న పెద్ది సినిమా కూడా ఓ మాస్ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న సినిమా .. ఇందులో కూడా చరణ్ క్యారెక్టర్ రంగస్థలం లో చిట్టిబాబులా ఉంటుందని కూడా ఇప్పటికే బుచ్చిబాబు క్లూస్ ఇస్తున్నాడు .. రీసెంట్గా చరణ్ పుట్టినరోజు కనుక ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కూడా ఎంతో రగ్ వైల్డ్ గా ఉంది . ఇదే క్రమంలో ఇప్పుడు శ్రీరామనవమి కనుకగా ఈ సినిమా కు సంబంధించి మేకర్స్ సాలిడ్ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా గ్లింప్స్ పై ఇప్పటికే కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి ..
ఈ గ్లింప్స్ వీడియో కట్ ఎంతో అద్భుతంగా వచ్చింది కానీ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా బాలేదు అంటూ కొన్ని మాటలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి .. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదట రెహమాన్ ఈ గ్లింప్స్ కోసం ఒక క్రేజీ సౌండింగ్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది . ఈనెల 6న ఈ వీడియో వచ్చాకా అందరికి దీని పై ఒక క్లారిటీ కూడా వస్తుందని అంటున్నారు .. ఇక ఈ సినిమా ని వృద్ధి సినిమాస్ , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసింది. మరి ఈ సినిమా తో రామ్ చరణ్ సరైన బ్లాక్ బాస్టర్ అందుకుంటాడో లేదో చూడాలి .