
సినిమాలో కథ నచ్చి క్యారెక్టర్ కోసం తన ఇమేజ్ ను లెక్కచేయకుండా వొళ్ళు హూనం చేసుకునే నటుల్లో విక్రమ్ కూడా ఒకరు . ఆయన చేస్తున్న సినిమాలు ఫెయిల్ అవుతాయేమో కానీ నటుడి గా ఆయన ప్రయత్నాని కి ఎప్పుడూ మంచి మార్కులే పడతాయి .. ఇక ఇప్పుడు తాజా గా ‘వీరధీరశూర’ సినిమా తో విక్రమ్ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు .. ఈ సినిమా కి మంచి టాక్ వచ్చింది దర్శకుడు అరుణ్ కుమార్ చాలా కొత్త అప్రోచ్ తో ఈ సినిమా ను తీశాడు . అలాగే టేకింగ్ లో కూడా కొత్తదనాన్ని చూపించిన సినిమా కూడా ఇదే .. అలాగే క్యారెక్టర్ పరంగా కూడా విక్రమ్ కష్టా న్ని ఎంతగా నో మెచ్చుకోవాలి .. ఎక్కడ ఎలివేషన్ లేకుండా కాళీ అనే క్యారెక్టర్ లోని కనిపించాడు ..
ఎంతో సహజం గా ఫైట్లు చేశాడు లెన్తీ సింగల్ షార్ట్స్ లో తను కనిపించిన తీరు క్యారెక్టర్ కోసం పడిన కష్టం తెర పై గట్టి గా కనిపిస్తుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా కి అనుకున్నంత ఫుట్ పాల్స్ కనిపించడం లేదు . సరైన ప్రమోషన్స్ లేకపోవడం ఒక రీజన్ అయితే లిమిటెడ్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అయ్యే కంటెంట్ కావటం మరో కారణం .. అయితే సినిమా కోసం విక్రమ్ పట్టిన కష్టం వృధా కాదనే చెప్పాలి .. ఈ యాక్షన్ సినిమా ని ఇలాంటి అప్రోచ్ తో కూడా తీయవచ్చునే ఓ కొత్తదారిని ఈ సినిమా చూపించింది .. ఇక మరి రాబోయే రోజుల్లో ఇలాంటి స్టైల్ మేకింగ్ లో సినిమా లు వస్తే గనుక సినిమా స్వరూపంలో ఓ కొత్త ఒరవడి వస్తుందని కూడా చెప్పవచ్చు .