
ఇలా ఈ మొత్తం సినిమాల్లో ఆర్జీవి శారీ ఎంతో కొంత సోషల్ మీడియాలో కొంత వైరల్ గా మారింది .. రాంగోపాల్ వర్మ తీసిన సినిమా కాబట్టి సహజంగానే ఆయన సినిమా పై ఇప్పుడు ఎవరికి ఆసక్తి కూడా లేదు .. అయితే తన వంతు ప్రయత్నం అయితే చేసుకుంటున్నాడు . కాకపోతే ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలన్నీ యూట్యూబ్లో కూడా జనాలు సరిగ్గా చూడటం లేదు .. ఇక ఈ సినిమా కోసం ఎంతమంది థియేటర్ కు వస్తారు అనేది ఆయనకే తెలియాలి ..
అదే విధంగా ఈ వారం ఓ స్పెషల్ కూడా ఉంది .. బాలకృష్ణ క్లాసికల్ మూవీ ఆదిత్య 369 రీ రిలీజ్ గా వస్తుంది .. ఇక దీనికోసం బాలయ్య స్వయంగా ప్రమోషన్లు కూడా చేస్తున్నారు .. ఇప్పటికే రీ రిలీజ్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు .. ఇలా రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి ఓ హీరో రావడం ఇదే మొదటిసారి .. ఆదిత్య 369 ఓ క్లాసికల్ మూవీ బహుశా ఈ వారం థియేటర్స్లోకి వెళ్లాలనుకునే ప్రేక్షకులకు ఇదే మంచి ఆప్షన్ కూడా కావచ్చు . అలాగే కొత్త సినిమాలు లేకపోవడం గత వారం వచ్చిన మ్యాడ్ 2, రాబిన్ హుడ్, లూసిఫర్, వీరధీర శూరకి గట్టిగా కలిసివచ్చే అంశం.