మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తో ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు .. అలాంటి ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత నటించిన తొలి పాన్ ఇండియా మూవీ దేవర .. ఈ సినిమా తో ఎన్టీఆర్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా భారీ కలెక్షన్ రాబట్టి సాలిడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు .. తాజాగా ఈ సినిమా జపాన్లో కూడా రిలీజ్ అయి భారీ కలెక్షన్ అందుకుంటుంది .. అలాగే ఈ సినిమాకు రెండో భాగం కూడా రాబోతుంది .


ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ దేవర రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు .. ఇదే క్రమంలో తాజాగా జపాన్లో ఎన్టీఆర్ దేవర 2 పై ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు ఎంతో వైరల్ గా మారింది ..  ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర 2 గురించి చెప్పాలంటే ఎంతో సర్ప్రైజింగ్ గా ఉంటుందని ఇది చాలా పెద్ద స్టోరీ పార్ట్1 లో దేవర కోసం చాలా నేర్చుకున్నాను .. ఈసారి పార్ట్ 2 లో మాత్రం వర కోసం ఎక్కువ తెలుసుకుంటారు అంటూ అసలే దేవర కి ఏమైంది అని బ్యాక్ స్టోరీ కి సమాధానం దేవ‌ర 2లో దొరుకుతుందంటూ ఎన్టీఆర్ రెండో భాగం పై సాలిడ్ క్లారిటీ కూడా ఇచ్చాడు .  


ఇక ఇప్పుడు ఈ అవైటెడ్ సీక్వెల్ ని మేకర్స్ ఈ ఏడాదిలోనే మొదలు పెడతారా లేక మ‌రికొంత‌ సమయం తీసుకుంటార‌ అనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు .. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 లో నటిస్తున్నాడు .  అలాగే మరోపక్క ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టాడు .. ఇదే క్ర‌మంలో మరో తమిళ దర్శకుడు నెల్సన్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు .  ఇలా వరుస అగ్ర దర్శకులు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న క్రమంలో .  దేవర పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది .. ఇక దీనిపై ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: