
ఈ విషయం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అయితే వినిపిస్తోంది. కానీ ఈ చిత్రం గా రికార్డు క్రియేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.. స్టోరీ పరంగా ఇది సప్త చిరంజీవులు స్టోరీ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. పురాణాలలో హనుమంతుడు, బలి, పరుశురాముడు, అశ్వద్ధామ , కృపుడు ఇలా ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. ఇందుకోసం క్యారెక్టర్లలో పవర్ ఫుల్ హీరోలను తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే ఈ చిత్రంలో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అన్నట్లుగా సమాచారం.
హనుమంతుడు, పరశురాముడు, అశ్వద్ధామ పాత్రల కోసం పాన్ ఇండియా హీరోలను తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం జై హనుమాన్ స్క్రిప్టును కూడా చాలా శరవేగంగా పూర్తి చేసేలా ఉన్నారు. మరి నుంచి రిషబ్ శెట్టి ఈ సినిమా షూటింగ్ కోసం జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. జై హనుమాన్ చిత్రం నుంచి టాలీవుడ్ లో ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసేలా అవకాశాలు ఉన్నాయనే విధంగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి టాలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతున్నది. మరి ప్రశాంత్ వర్మ ఏ ఏ హీరోలను తీసుకువస్తారో చూడాలి.