
కిల్లర్ అనే మూవీలో నటి జ్యోతి రాయ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ పోస్టర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఒక రొమాంటిక్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ. పూర్వాజ్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. జ్యోతి రాయ్ ఈ సినిమాలో తన రియల్ లైఫ్ భర్తతో నటిస్తుంది. ఈ మూవీ దర్శకత్వం కూడా పూర్వాజ్ యే వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతుంది.
ఈ సినిమాలో హీరోగా నటిస్తూ టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. విశాల్ రాజ్, గౌతమ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఏఐ కాన్సెప్ట్‌తో తెలుగులో వస్తోన్న తొలి మూవీ ఇదని మూవీ మేకర్స్ చెబుతున్నారు. అయితే ఈ సినిమా పోస్టర్ లో జ్యోతి రాయ్ కిల్లర్ గా, మోడ్రన్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించింది. రియల్‌లైఫ్‌లో భార్యాభర్తలైన జ్యోతిరాయ్, సుకు పూర్వజ్ రీల్ లైఫ్‌లో అదే క్యారెక్టర్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్ ని చూశాక ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.