హీరోయిన్ షాలిని పాండే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ అందాల భామ అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి హిట్ కొట్టి ప్రేక్షకులకు దగ్గరైంది. దాంతో ఈమెకి చాలానే సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఈమె తెలుగుతో పాటుగా తమిళం సినిమాలలో కూడా నటించింది. ఈమెకి తెలుగు రాకపోయినా కూడా చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పుకుంది. ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ సందర్బంగా షాలిని పాండే మాట్లాడుతూ.. ప్రేక్షకులు తనను ఎంతగానో అభిమానిస్తున్నారని చెప్పుకొచ్చింది. వారి ప్రేమాభిమానాలని తాను వెలకట్టలేనివని చెప్పింది.కానీ కొంతమంది అభిమానులు మాత్రం తనని హీరోయిన్ ఆలియా భట్ తో పోల్చుతున్నారని అంది. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక ఆలియా భట్ ఉన్నారని.. మళ్లీ ఇంకో ఆలియా అవసరం లేదని ఆమె తెలిపింది. ఆలియాలా ఉండాలని ఎవరు అనుకోరు.. ఎందుకంటే తాను ఒక అద్బుతమైన నటి అని చెప్పుకొచ్చింది. కేవలం సినీ రంగంలోనే కాదు, నిజ జీవితంలో కూడా ఆలియా చాలా ఉన్నతంగా ఉంటారని తెలిపింది.

 
ఆలియాని చూసి తాను కూడా స్పూర్తి పొందుతుందని.. ఎన్నో విషయాలు నేర్చుకుంటుందని షాలిని అంది. కానీ షాలిని పాండేని, ఆలియా భట్ తో పోల్చడం తనకు నచ్చదని చెప్పుకొచ్చింది. తనని తనలాగే గుర్తించి ఆదరిస్తే చాలానే అంది. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తన కోరిక అని.. ఎవరు తనని అలా పోల్చిన తనకి ఇష్టం ఉండదని షాలినీ పాండే చెప్పుకొచ్చారు.  ఇటీవలే ఈ అందాల భామ డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ప్లీక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ప్రస్తుతం బ్యూటీ షాలిని పాండే వెబ్ సిరీస్ లలో నటిస్తూ.. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: