శ్రీదేవి డెత్ ఇప్పటికి కూడా మిస్టరీగానే మిగిలిపోయింది.బాత్ టబ్ లో మునిగి చనిపోయింది అని దుబాయ్ పోలీసులు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఆమె మరణంపై ఇప్పటికే ఎంతోమంది అనుమానాలు వ్యక్తం చేశారు.ముఖ్యంగా శ్రీదేవి పేరు మీద ఉన్న 200 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే బోనీకపూర్ శ్రీదేవిని చంపించాడు అంటూ కూడా రూమర్లు వినిపించాయి. శ్రీదేవి మరణం లో బోనీకపూర్ పై చాలానే అనుమానాలు వ్యక్తం చేశారు.ఆమె అభిమానులతో పాటు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అయితే బోనీ కపూర్ మాత్రం ఇందులో ఎలాంటి తప్పు నాది లేదు అని చెప్పేసారు. అంతేకాదు శ్రీదేవి కఠినమైన డైట్ పాటించడం వల్ల అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోయేది. 

అలా ఎన్ని సార్లు చెప్పినా వినకుండా డైట్ చేయడంతో చివరికి బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో కళ్ళు తిరిగి అందులోనే పడిపోయి చివరికి నీళ్లలో మునిగి చనిపోయింది అని పోలీసులు తేల్చేశారు. అయితే శ్రీదేవి మరణంతో ఒక సంఖ్యకి సంబంధం ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే శ్రీదేవి మరణానికి నెంబర్ 4 కి మధ్య సంబంధం ఉందట. అదెలా అంటే శ్రీదేవి 1963 ఆగస్టు 13న పుట్టింది. అయితే 13,4, 22, 31 ఈ తేదీలలో పుట్టిన వారి మూలాంకనం 4.అయితే ఈ 4 కి రాహువు అధిపతిగా ఉంటారు.ఇలాంటి తేదీలలో పుట్టిన వారికి మూలాంకనం 4.

 అయితే వారి జీవితంలో అనుకోని సంఘటనలు వస్తాయి.రహస్యం మరణంతో పాటు ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా మూలంకనం 4 ఉన్నవారు జీవితంలో ఎన్నో అత్యున్నత స్థానాలను అందుకొని అందరిలో వాళ్లే ఆకర్షణీయంగా కనిపిస్తారు.వారి లక్ష్యాలు చేధించడంలో ముందుంటారు.అలాగే వారి లోపల ఏముంది అనేది తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు.ఎందుకంటే ఇలాంటి వారు తొందరగా బయటపడరు. మూలాంకనం 4 ఉన్న వ్యక్తుల్లో అనుకోని సంఘటనలు జరిగి కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలతో పాటు ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అంతే కాదు వీరి చావు కూడా వింతగా ఉంటుంది. అందుకే శ్రీదేవి చావు కూడా చాలా వింతగా ఉంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: