సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హ్యాపీనెస్ ఏమో కానీ ట్రోలింగ్ ఎప్పుడు మన పక్కనే ఉంటూ వస్తుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి గురించి వైరల్ అవుతున్న  వార్తలు చూస్తే మెగా అభిమానులకు కన్నీళ్లు తప్పవు . ఎందుకంటే ఇన్నాళ్లు సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవిని మెగా వారసుడిపై ఆయన చేసిన కామెంట్స్ కారణంగా అదేవిధంగా తాత గారిపై చేసిన నాటీ కామెంట్స్ కారణంగా రకరకాలుగా ట్రోల్ చేశారు.  ఇప్పుడిప్పుడే అవన్నీ మర్చిపోతూ మెగాస్టార్ చిరంజీవి నటించబోయే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు .


అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాలో నటించబోతున్నాడు. రీసెంట్ గానే  పూజా కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించి టీం ని ఇంట్రడ్యూస్ చేస్తూ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు . ఆ వీడియో చాలా చాలా ట్రెండింగ్ లోకి వచ్చింది. అనిల్ రావిపూడి తన సినిమాని చాలా పక్కాగా ప్లాన్ చేశారు . అయితే # మెగా 157 ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇంతవరకు ఓకే అంతా బాగానే ఉంది మెగా ఫాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు.



చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో మరొక బ్లాక్ బస్టర్ వేసుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు అని మాట్లాడుకున్నారు . అయితే ఎప్పటిలాగే పని పాట లేని మెగా హేటర్స్ మెగాస్టార్ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు . మెగా 157 ఓకే మెగా 156  పరిస్థితి ఏంటి..? అసలు విశ్వంభర సినిమాకి ప్రమోషన్స్ ఎక్కడ..?  విశ్వంభరని పట్టించుకుంటున్నారా ..? అంటూ ఘాటుఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . నిజమే విశ్వంభర సినిమా గురించి అస్సలు జనాలు పట్టించుకోవడం లేదు . అసలు మేకర్స్ కూడా ఆ సినిమాను వదిలేసినట్లు ఉన్నారు. ప్రమోషన్స్ లేవు ఎంత పెద్ద స్టార్ హీరో అయిన సినిమాకి ప్రమోషన్స్ కావాలిగా అంటున్నారు సినీ ప్రముఖులు . మెగా 157 మోజులో పడి మెగా 156 ని మర్చిపోయారేమో అంటూ కూడా ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు జనాలు.  ఇది మెగాస్టార్ చిరంజీవి కి బిగ్ మైనస్ గా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: