
ఇక చిరంజీవి ,అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చే సినిమా ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేస్తుంది .. ఇలా పూర్తి చేసుకున్న తొలి రోజు నుంచే ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే మొదటి ప్రచార వీడియో లో భాగంగా టెక్నీషియన్స్ ను పరిచయం చేశారు . చిరంజీవి గత సినిమాలన్నీ గుర్తుచేస్తూనే ఒక్కో విభాగాన్ని పరిచయం చేశారు .. డైరెక్షన్ డిపార్ట్మెంట్ , మ్యూజిక్ , ఆర్ట్ , సినిమాటోగ్రఫీ ఇలా అందరినీ పరిచయం చేస్తూ చివర్లో దర్శకుడు అనిల్ రావిపూడిని కూడా చూపించారు .. అయితే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది .. కానీ సినిమాకు సంబంధించిన హీరోయిన్ మాత్రం ఇంకా ఎవరని ఫైనల్ చేయలేద ని తెలుస్తుంది .. ఇక మొన్నటి వరకు అదితి రావు పేరు గట్టి గా వినిపించింది ..
నిజం గానే ఆమె ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టయితే .. సినిమా ఓపెనింగ్ కు అదితి కచ్చితంగా వచ్చి ఉండేది .. కానీ అది అక్కడ ఏం జరగలేదు .. అంటే హీరోయిన్ ఎంపిక ఇంకా అధికారికంగా పూర్తి కాలేదన్నమాట .. అనిల్ రావిపూడి తో పాటు చిరంజీవి కూడా హీరోయిన్ విషయం లో మరో ఆప్షన్ కోసం వెతుకుతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి .. ఇక మరో పక్క ఇదే యూనిట్ లో ఇంకొంత మంది మాత్రం అగ్రిమెంట్ పూర్తి కాకపోవటం తో అదితి ఓపెనింగ్ కు రాలేదని మరో హీరోయిన్ గా ఆమె కన్ఫర్మ్ అయింద ని అంటున్నారు. . అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఎవరికీ తెలియదు .. ఈ సినిమా కి సంబంధించిన హీరోయిన్ విషయం పై అధికారిక ప్రకటన వచ్చేవరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి . ఇక మరి ఈ విషయం పై అనిల్ రావిపూడి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో చూడాలి .