సినిమాల ట్రెండ్ మారిపోతుంది .. ఒకప్పుడు స్టార్ హీరోలంటే ఎంతో స్టైలిష్ గా ఉండాలనే రూల్ పెట్టుకునే వారు .. కానీ ఇప్పుడు రొటీన్ స్టైలిష్ లుక్‌ జనాలకు తెగ బోర్ కొట్టేసింది .. హీరోలు అంటే ఎంతో ఊర‌మ‌స్‌గా  కనిపించాలనే ట్రెండ్ గట్టిగా నడుస్తుంది .. ఎంత రఫ్ గా కనిపిస్తే అంత మాస్ ఫాలోయింగ్ అన్నట్టు అంతా మారిపోయింది .  దీన్నే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా గట్టిగా ఫాలో అవుతున్నారు .  స్టైలిష్ డ్రెస్లు వేసుకోవటం లేదు మేకప్ లు కూడా సరిగ్గా వాడటం లేదు పూర్తిగా   వైల్డ్ రగ్డ్ గా కనిపించేందుకే సిద్ధమవుతున్నారు .. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎంత రగ్డ్  లుక్ లో కనిపించారో చూసాం ఆ లుక్కుకు భారీ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది .
 

అంతకన్నా ముందు ప్రభాస్ సలార్ లో కూడా ఇలాగే కనిపించాడు .. ఇక ఆ రగ్డ్  లుక్ కు మాస్ క్రేజ్ కూడా మామూలుగా రాలేదు .. ఇక ప్రభాస్ స్టైలిష్ లుక్ లో కంటే ఆ మాస్ లుక్ లోనే బాగున్నాడంటే క్రేజ్ కూడా బాగా వచ్చింది .  ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాల్లో కూడా ఇలాగే కనిపించబోతున్నాడు . ఇక మన దేవరల్లో కూడా మాస్ లుక్ లోనే అదరగొట్టాడు .  ఇక‌ ఇప్పుడు ప్రశాంత్ నీల్‌ సినిమాలో పూర్తిగా గెడ్డం , మీసాలతో దుమ్ము లేపే ఎందుకు రెడీ అవుతున్నాడు .. మరోపక్క రామ్ చరణ్ కూడా బుచ్చిబాబు తో చేసే పెద్ది సినిమాలో కూడా ఎంత ర‌గ్డ్ గా ఉన్నాడో మన ఫస్ట్ లుక్ లోనే తెలిసిపోయింది .. ఇక మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా లో వైల్డ్ రగ్డ్ గానే కనిపించబోతున్నాడు .. ఇక నాని ఇప్పటికే దసర సినిమాలో ఇలాంటి లుక్ లో అదరగొట్టాడు ..

 

ఇక ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమాలో మరో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు . ఇక విజయ్ దేవరకొండ కూడా కింగ్డమ్ సినిమా కోసం పూర్తిగా మాస్ లుక్ లో మారిపోయాడు .  ఇలా స్టార్ హీరోలు అంతా రొటీన్ లుక్ ను వదిలేసి సినిమా కోసం ఎలాంటి లుక్ లోకైనా మారేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు .. పూర్తిగా మాస్ రగ్డ్‌ లుక్ కోసమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఇది కూడా ఒకరకంగా మంచిదే .. అ లుక్ లో ఉంటేనే సినిమా క‌థ‌కు న్యాయం చేసినట్టు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: