
ఇక వాటికి తగ్గట్టుగానే మేకర్స్ గ్రాండ్గా ప్లానింగ్స్ ఈ సినిమాకి చేస్తుండగా ఇప్పుడు ఓ సాలిడ్ అప్డేట్ కోసం అయితే అభిమానులు ఎదురుచూస్తున్నారు .. ఈ క్రమంలోని ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు బయటకి వస్తుంది . దీంతో ఈ సినిమా కోసం చిరు సింగర్ గా మారబోతున్నారని కూడా తెలుస్తుంది ..ఇక ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ సినిమాల కోసం పాటలు పాడిన విషయం తెలిసిందే .. చిరంజీవి కూడా గతంలో తన సినిమాల కోసం పాటలు పాడారు .. అలాగే పాటలతో పాటుగా పాటలో కొన్ని కొన్ని డైలాగ్స్ తో మాట సాయం అందించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి .. అయితే ఇప్పుడు విశ్వంభర కోసం చిరంజీవి మరోసారి తాను ఈ స్టాప్ తీసుకున్నట్టుగా రూమర్లు వినిపిస్తున్నాయి .
ఇక మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది .. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే . అలాగే యూవీ క్రియేషన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు .. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. మొన్నటి వరకు ఈ సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి . ఇక మరి ఈ సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.