పాన్ ఇండియా హీరో ప్రభాస్ , హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోలో సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే .. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ను నిర్మిస్తుంది .. అలాగే ఈ మూవీకి ‘ఫౌజీ’  అనే పేరుని కూడా పరిశీలనలో ఉంచారు  .. అయితే ఇప్పుడు ఈ సినిమా అవుట్ ఫుట్ పై మైత్రి మూవీస్ ఎంతో సంతృప్తిగా ఉంది ప్రభాస్ కూడా రాఘవపూడి వర్కింగ్ స్టైల్ బాగా నచ్చిందని తెలుస్తుంది .. ఎక్కడికి వెళ్ళినా హను సినిమా మేకింగ్ ముచ్చట్లే చెబుతున్నాడట .. అంతేకాకుండా ఇప్పుడు మరో సినిమా ఆఫర్ ఇచ్చాడని కూడా తెలుస్తుంది . పౌజీ పూర్తి కాకుండానే మరో సారీ హ‌నుతో సినిమా చేయడానికి ప్రభాస్ ఓకే చెప్పాడట . అంతేకాకుండా ఓ అగ్ర నిర్మాతతో హనుకు అడ్వాన్స్ కూడా  ఇప్పించినట్టు తెలుస్తుంది ..


ఇక ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది ఈ ప్రాజెక్టును ఓకే చేసింది కూడా ప్రభాస్ అనే తెలుస్తుంది .. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలుపెట్టడం కష్టం ఎందుకంటే పౌజీ పూర్తి అవ్వగానే స్పిరిట్ మొదలవుతుంది మధ్యలో ప్రశాంత్ వర్మ  బ్రహ్మ రాక్షస్‌ ఉంటుంది . అలాగే సలార్ 2 కోసం డేట్లు ఇవ్వాలి కల్కి2 ఉంటుంది .. వీటి మధ్యలో హ‌ను సినిమా ఉండచ్చు అయితే ఈసారి ప్రభాస్ తో కంప్లీట్ లవ్ స్టోరీ చేయడానికి హ‌ను ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం .. లవ్ స్టోరీ కాబట్టి యాక్షన్ బాధలు లేవు కాబట్టి సింపుల్ గా చాలా ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది ..  ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నారు .. ఆయన ఈ నెలాఖరుకు ఇండియాకి తిరిగి వస్తున్నట్టు తెలుస్తుంది రాగానే రాజాసాబ్‌ కోసం కొన్ని డేట్లు ఇస్తారు .. దాంతో పాటు ఫౌజీ సినిమాని కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: