తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న అంశం HCU (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) ఈ అంశం మీద తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాలలో విస్తరించి ఉన్న అడవిని, అందులో ఉంటున్న జంతువులను, అరుదైన మొక్కలను తొలగించడంపై తీవ్రస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో పాటు సామాన్య ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు సైతం మద్దతు తెలుపుతున్నారు. 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉదాంతంపై సినీ నటులు అందరూ ఏకమవుతున్నారు. తాజాగా ఈ వివాదంపై నటి సమంత, మెగా ఇంటికి కోడలు ఉపాసన, నటి రేణు దేశాయ్ స్పందించారు. ఈ క్రమంలోనే తాజాగా నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒక తల్లిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు, మన తరాల పిల్లలకి ఆక్సిజన్ ఎంతో అవసరం. భవిష్యత్తు తరాల కోసం ఈ 400 ఎకరాల భూమిని ఏమి చేయకుండా అలానే వదిలేయండి. సమాజం కోసం ఈ ఒక్క పనిని చేయండి అంటూ రేణు దేశాయ్ రిక్వెస్ట్ చేశారు. 

ఇంకా ఎక్కడైనా స్థలం చూసుకుని డెవలప్మెంట్ చేయండి అంటూ నటి రేణు దేశాయ్ సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. నటి రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యాలపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఈ అంశం పైన ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్దలు స్పందిస్తున్నారు. ఆ భూమిని అలానే వదిలేయాలని, అందులో ఉన్న వన్యప్రాణులను, మొక్కలను, జంతువులను కాపాడాలని వేడుకుంటున్నారు. ఈ విషయం పైన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. చిన్నపిల్లల సైతం ఈ విషయం పైన స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పైన నిప్పులు చెలరేగుతున్నారు. ప్రజలు, జంతువులు, మొక్కలు వీటన్నింటి గురించి రేవంత్ రెడ్డి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: