తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్న విషయం తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఈ హీరో గురించి తెలియనివారంటూ ఎవరు ఉండరు. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ సుపరిచితమే. ముఖ్యంగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఎంతగానో పెరిగిపోయింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను తెరకెక్కించారు.
 

ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన నటించింది. పుష్ప-2 సినిమాకు సీక్వెల్ గా పుష్ప-3 సినిమా కూడా ఉండనుంది. ఈ సినిమా షూటింగ్ ను అతి తొందర్లోనే ప్రారంభిస్తామని ఓ సందర్భంలో సుకుమార్ వెల్లడించారు. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్ తదుపరి సినిమాను డైరెక్టర్ అట్లితో తీయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.

అల్లు అర్జున్ తాజాగా ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇటీవలే జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనల వల్ల అల్లు అర్జున్ తన కెరీర్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా, మరిన్ని విజయాల కోసం ఆయన తన పేరులో కొన్ని మార్పులు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. తన పేరులో సంఖ్యాపరమైన మార్పులకు సిద్ధపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. తన పేరు స్పెల్లింగ్ లో ఆదనంగా U, N లు జోడించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సినీ వర్గాల్లో సమాచారం అందుతుంది. ఈ విషయం పైన పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై అల్లు అర్జున్ ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: