హీరోయిన్ దివ్య భారతి అంటే అందరూ సీనియర్ దివంగత నటి దివ్యభారతి అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లో కూడా ఓ దివ్యభారతి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలా నటుడు మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి జీవి ప్రకాష్ సరసన హీరోయిన్ గా బ్యాచిలర్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మళ్లీ ఇదే హీరోతో కింగ్ స్టన్ మూవీలో కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు జీవి ప్రకాష్ ఇంతలోనే తన భార్య సైంధవీకి కూడా విడాకులు ఇవ్వడంతో దివ్యభారతి జీవి ప్రకాష్ ఎఫైర్ వార్తలకు మరింత బలం చేకూరింది.. దివ్యభారతి కారణంగానే జీవి ప్రకాష్ తన భార్య సైంధవితో విడాకులు తీసుకుంటున్నారని, జీవీ ప్రకాష్ సైంధవీల కాపురంలో దివ్యభారతి చిచ్చు పెట్టింది అని ఎన్నో రూమర్లు వినిపిస్తున్నాయి.

అంతేకాదు వీరి కాంబోలో రెండు సినిమాలు వరుసగా రావడంతో ఆ ఎఫైర్ వార్తలకు మరింత నమ్మకం కలిగేలా చేశాయి. అయితే గత కొద్ది రోజులుగా జీవి ప్రకాష్ తో డేటింగ్ వార్తలపై దివ్యభారతి వాటిని కొట్టి పారేస్తూనే ఉంది. అలాగే జీవి ప్రకాష్ కూడా ఈ వార్తలను కొట్టి పారేశారు.ఇక తాజాగా దివ్యభారతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇదే చివరిసారిగా చెబుతున్నాను. నేను ఎవరితోనూ డేటింగ్ లో లేను. నాకు ఎవరితో ఎఫైర్ లేదు.అలాగే పెళ్లయిన వ్యక్తి జీవితంలోకి నేను వెళ్లాలి అనుకోవడం లేదు.  ఆధారాలు లేకుండా లేనిపోని రూమర్లు సృష్టించకండి.నాకు ఎవరితో ఎలాంటి సంబంధం లేదు. ఎవరి కుటుంబ విషయాల్లోకి నన్ను లాగకండి. ఇదే చివరిసారి.

ఇలాంటి నిరాధారమైన వార్తలలోకి నన్ను లాగి నా కెరీర్ నాశనం చేస్తున్నారు. ఆధారాలు లేని రూమర్లను ప్రచారం చేయకండి.నా పర్సనల్ లైఫ్ ని కూడా గౌరవించండి. ఇలాంటి అతీ గతీ లేని రూమర్ల కారణంగా నా సినీ కెరియర్ పై దెబ్బ పడుతుంది.ఈ గాసిప్ ల వల్ల నా కెరియర్ పై దెబ్బ పడాలని నేను అనుకోవడం లేదు. ఇప్పటికైనా ఈ రూమర్ల నుండి నన్ను దూరం పెట్టండి. జీవి ప్రకాష్ తో ఎఫైర్ వార్తలపై ఇదే నా చివరి ప్రకటన. ఇంకోసారి ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేస్తే బాగుండదు అంటూ దివ్యభారతి సంచలన పోస్ట్ చేసింది.ప్రస్తుతం దివ్యభారతి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: