డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు సినీ ఇండస్ట్రీలోనే సక్సెస్ ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్టుగానే నిలిచింది. ఎక్కువగా కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలనే బాక్సాఫీస్ వద్ద విడుదల చేస్తూ భారీ విజయాలను అందుకున్నారు. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో అటు డైరెక్టర్ హీరో 300 కోట్ల క్లబ్లో చేరారు. ఇప్పుడు తాజాగా చిరంజీవితో మరొక బ్లాక్ బాస్టర్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు అనిల్ రావుపూడి. ఈ సినిమాకి మెగా -157 అనే వర్కింగ్ టైటిల్ తో పూజా కార్యక్రమాలను కూడా ఇటీవలే చేయడం కూడా జరిగింది.


ముఖ్యంగా ప్రమోషన్స్ వీడియోలను ఎక్కువగా విడుదల చేస్తూ ఉంటారు డైరెక్టర్ అనిల్ రావుపూడి.చిరంజీవి చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమానికి రావడంతో తన టీమ్ ని సైతం పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని కూడా విడుదల చేశారు. అలా సంక్రాంతికి వస్తున్నాం సినిమా టైపులోనే ఈ చిత్రాన్ని కూడా జనాలలోకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి 157 చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు.


డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి 15 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ సినిమా భారీ విజయం కావడంతో ఏకంగా తన రెమ్యూనరేషన్ 20 కోట్ల రూపాయల వరకు పెంచేశారట.కెరియర్ ప్రారంభంలో పటాస్ సినిమాకి కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే అందుకున్నారట. కానీ ఇప్పుడు ఏకంగా 20 కోట్ల రూపాయలు తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినిమాల సక్సెస్ ను బట్టి డైరెక్టర్లు రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటారని ఇక ఇలాంటి డైరెక్టర్లకు నిర్మాతలు డబ్బులు ఇవ్వడానికి కూడా వెనకాడడం వేయలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏంటన్నది చూడాలి. మొత్తానికి ఈ సినిమాతో కళ్ళు చెదిరే  రెమ్యూనరేషన్ అందుకున్నారు అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: