శ్రీదేవి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా..? నో  ఆమె పేరు చెబితేనే ఏదో తెలియని వైబ్రేషన్స్ ఆమె ముఖం చూస్తేనే తెలియని కల.. శ్రీదేవిని ఒక్కరంటే ఒక్కరు కూడా నెగిటివ్ గా మాట్లాడిన సందర్భాలలో లేవు. శ్రీదేవి అంటే చాలామంది హీరోయిన్స్ కి కూడా ప్రత్యేక అభిమానం. ఆమె ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించదు . అందరినీ చాలా ఫ్రెండ్లీగా పలకరిస్తుంది . అంతే ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తుంది . అలాంటి శ్రీదేవి ఇప్పుడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం . శ్రీదేవి అభిమానులు ఇప్పటికీ ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు .


శ్రీదేవి లేని లోటును ఆమె కూతురు జాన్వి కపూర్ తీర్చబోతుంది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు . అయితే మొదటి నుంచి శ్రీదేవి చాలా చాలా స్ట్రిక్ట్.  తను అనుకున్న పని కచ్చితంగా చేసి తీరుతుంది . ఇంట్లో కూడా ఆమె కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ పెట్టింది . తినే ముందు డైనింగ్ టేబుల్ వద్ద ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ యూస్ చేయకూడదు.  మరీ ముఖ్యంగా అందరూ కలిసే బ్రేక్ ఫాస్ట్ - లంచ్ - డిన్నర్ చేయాలి . శ్రీదేవి బ్రతికున్నంత వరకు ఈ కండిషన్స్ తూ ఛా తప్పకుండ పాటిస్తూ వచ్చారు కుటుంబ సభ్యులు.


అయితే ఇప్పుడు శ్రీదేవి లేదు . అయినప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం ఆ కండిషన్స్ అస్సలు నెగ్లెట్ చేయడం లేదట.  శ్రీదేవి పట్టిన కండిషన్స్ ఆమె ఉన్నా లేకపోయినా అలాగే ఫాలో అవ్వాలి అని శ్రీదేవి అప్పుడే హ్యాపీగా ఉంటుంది అని బోని కపూర్ భావిస్తూ ఆమె లేకపోయినా సరే ఆమె పెట్టిన కండిషన్స్ ఇంట్లో ఫాలో అయ్యే విధంగా ట్రై చేస్తున్నారట . ఇప్పటికి జాన్వీ కపూర్ - ఖుషి కపూర్ - బోనీకపూర్ కలిసే బ్రేక్ ఫాస్ట్ చేస్తారు.. కలిసే లంచ్ చేస్తారు .. కలిసే డిన్నర్ చేస్తారట . ఆ సమయంలో నో టెలివిజన్.. నో ఎలక్ట్రానిక్ మీడియా .. నో సోషల్ మీడియా.. నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ .. పూర్తిగా ప్రశాంతంగా ఫ్యామిలీతో టైమ్  స్పెండ్ చేసే విధంగానే ఇప్పటికీ ఫాలో అవుతున్నారట.  ఇది నిజంగా వెరీ వెరీ గ్రేట్ అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: