ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు . మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటించారు . ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది.  అయినా సరే ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు . ఎక్కడ చూసినా సరే అందరూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.  దానికి తగ్గట్టు అనిల్ రావిపూడి సైతం సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు .


రీసెంట్గా అనిల్ రావిపూడి తన టీం ని పరిచయం చేస్తూ .. ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు . ఈ వీడియో చాలా చాలా ఆకర్షణీయంగా అదే విధంగా ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటుంది . ప్రజెంట్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.  కాగా అనిల్ రావిపూడి తన టీమ్ ని పరిచయం చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్న చిరంజీవి పోస్టర్స్ ను అక్కడ చూపించారు . మరి ముఖ్యంగా చిరంజీవి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ఈ వీడియోలో ఉండడం గమనార్హం.



అయితే అనిల్ రావిపూడి మొదటి నుంచి కూడా తన సినిమాల విషయంలో పక్క ప్లాన్ తో ముందుకు వెళుతూ ఉంటాడు.  మరీ ముఖ్యంగా తన సినిమాల విషయంలో మెడ్లీని ఎక్కువగా హైలెట్ చేస్తూ ఉంటారు . ఎఫ్2 ఎఫ్3 సినిమా విషయంలో అది బాగా వర్క్ అవుట్ అయింది . ఆ తర్వాత భగవంత్  కేసరి సినిమాలోనూ బాలయ్య చేత రకరకాలుగా కామెడీ పండించి నవ్వించాడు . పాత డైలాగ్స్ మెడ్లీ లా చెప్పించి అదరగొట్టేసాడు.  చిరంజీవితో సినిమా విషయంలో కూసింత ముందుగానే ఆ స్టెప్ తీసేసుకున్నాడు అనిల్ రావిపూడి . సినిమా ఇంట్రడక్షన్ తోనే ఆ మెడ్లీని బాగా చూపించాడు . రకరకాల హిట్ సినిమా పోస్టర్ ల తో చిరంజీవి స్టైల్ ని మరొకసారి జనాలకి రుచి చూపిస్తున్నాడు . అనిల్ రావిపూడి కి సినిమాని ఎలా తెరకెక్కించాలి అని కాదు .. సినిమాకి ఎలా హైప్ తీసుకోరావాలి.. ఎలా ప్రమోట్ చేసుకోవాలి అన్న విషయం కూడా బాగా తెలుసు అంటూ మాట్లాడుతున్నారు జనాలు . చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: