
రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబుతో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలుసు . అయితే ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా చాలా గోప్యంగా ఎవరిని పిలవకుండా ఆ ఫోటోలు బయటకు రాకుండా చేశాడు. రీసెంట్ గా సినిమా మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. ఆ పిక్స్ కూడా బయటకు రాకుండా చేశాడు . ఎంత ఆయన జాగ్రత్త పడిన సినిమా నుంచి కొన్ని సీన్స్ లీక్ అయిపోయి వైరల్ అయ్యాయి . అయితే. రాజమౌళి ఎందుకు మహేష్ బాబు తో సినిమా గురించి ఒక అప్డేట్ కూడా ఇవ్వడం లేదు అనేది ఇప్పుడు జనాలకు బాగా కోపం తెప్పిస్తుంది .
సినిమా లుక్స్ కోసమే సంవత్సరం వేస్ట్ చేయించిన రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ ఇవ్వడానికి సినిమా గురించి అప్డేట్ ఇవ్వడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటాడు ..??? అంటూ ఫైర్ అవుతున్నారు. రాజమౌళి చూపిస్తున్న అతి జాగ్రత్త.. రాజమౌళి - మహేష్ బాబు సినిమాకి మైనస్ గా మారబోతుందేమో అని అంటున్నారు జనాలు. బాలీవుడ్ జనాలు కూసింత ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుల పేర్లు మరొకసారి వైరల్ గా మారాయి . జక్కన్న ఎంత త్వరగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ రిలీజ్ చేస్తే అంత బావుంటుంది అంటున్నారు ఫ్యాన్స్. చూద్దాం మరి రాజమౌళి ఏం చేస్తారో..???