
తాజాగా చిత్ర బృంధం సిక్కిం రాష్ట్ర సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ కు సిక్కింకు వచ్చినందుకు ముఖ్యమంత్రి చిత్ర బృందానికి సైతం ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయడం జరిగింది. హీరో కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ శ్రీలీలకు కూడా తమ రాష్ట్ర సాంప్రదాయమైన వాటిలో కొన్ని బహుమతులను కూడా సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి అందించినట్లు తెలుస్తోంది. అలాగే అక్కడ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం కూడా ఉంటుంది అంటూ చిత్ర బృందానికి తెలియజేశారట.
ఈ విషయానికి సంబంధించి సిక్కిం సీఎంకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలు స్పెషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. దీంతో డైరెక్టర్ అనురాగ్ బసు కూడా ముఖ్యమంత్రికి సైతం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.. ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ప్రజల నుంచి తమకు వచ్చిన మద్దతు చూసి తనకు చాలా ఆనందంగా ఉందని హీరో కార్తీక్ ఆర్య కూడా తెలియజేశారు. సిక్కిం లో ఉండే ప్రకృతి అందాలు ఇక్కడ సాంస్కృతి సంప్రదాయాలు కూడా తనని చాలా ఆకట్టుకున్నాయని శ్రీ లీల వెల్లడించింది. ఈ పర్యటనను తన జీవితంలో మర్చిపోలేను అంటూ తెలియజేసింది