లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది తెలుగులో ఎన్నో బ్లాక్ పాస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలు చేసి తన హవాను కొనసాగించింది. దాదాపు కొన్ని వందల చిత్రాలలో నటించిన ఈ చిన్నది సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. ఇక ఈ చిన్నది తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ సినిమాలలోనూ నటించి మంచి గుర్తింపు అందుకుంది. 


తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన ఈ చిన్నది తన నటనకు గాను నంది అవార్డు, సైమా అవార్డులను అందుకుంది. అంతేకాకుండా తన సినిమాల ద్వారా ఎంతో విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిన్నది లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు అందుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ చిన్నది సినిమాలలో రాణిస్తున్న సమయంలోనే డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. 

అయితే వివాహం తర్వాత కూడా ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార ముందు వరసలో ఉంటారు. ప్రస్తుతం నయనతార సోషల్ మీడియాలోనూ తనకు, తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది. 

అందులో నయనతార బ్లాక్ కలర్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ వద్ద ఫోటోలు తీసుకుంది. ఈ బికినీలో నయనతార చాలా హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఇలాంటి బట్టలు ధరించడం అవసరమా అని కొంతమంది నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్ల పైన నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: