థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ  వేసవిలో సినీ ప్రియులకు పండగానే చెప్పాలి. ఎందుకంటే ఒకటి, రెండు కాదు.. ఏకంగా 8 పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అవ్వనున్నాయి. అయితే విడుదల అయ్యి, స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఏవో తెలుసుకుందాం.
 
ఈ వేసవి సెలవులలో ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన ఈటీవీ వీన్ సిద్ధం అయ్యింది. ఉద్వేగం సినిమా ఈ నెల 3 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమాని గతేడాది నవంబర్ లో థియేటర్ లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని మహిపాల్ రెడ్డి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఉద్వేగం సినిమాలో త్రిగుణ్‌, దీప్సిక, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ముఖ్య పాత్రలలో నటించారు. అలాగే ఏప్రిల్ 3వ తేదీన పూజిత పొన్నాడ, తులసి నటించిన ఉత్తరం సినిమా, సోనియా సింగ్, శ్రీహన్ నటించిన లైఫ్ పార్ట్ నర్ అనే సినిమా విడుదల కానున్నాయి.


ప్రేక్షకుల హృదయాలను కదిలించే లవ్ యూ నానమ్మ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నానమ్మ, మనవరాలి బంధం గురించి ఉంటుంది. టుక్ టుక్ అనే సినిమా ఏప్రిల్ 10న ఓటీటీ విడుదల అయ్యి సందడి చేయనుంది. ఈ సినిమా మ్యాజిల్ పవర్స్ గురించి చూపిస్తుంది. ఇక తండ్రికూతురు బంధం గురించి చూపించిన వెండి పట్టీలు సినిమా కూడా ఈ నెల 20న రిలీజ్ అవ్వనుంది. రొమాంటిక్ కామోడీ మూవీ కొత్త కొత్తగా సినిమా 24న రిలీజ్ అవ్వనుంది. దీంతోపాటుగా ట్రింగ్ ట్రింగ్ సినిమా కూడా 27న ఓటీటీ లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.  వీటితో పాటు పెంకుటిల్లు, నాతి చరామి సినిమాలు విడుదల కానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: