
ఇలా పలు చిత్రాలలో నెగిటివ్ పాత్రలలో కనిపించిన ఈమె కానీ కెరియర్ పరంగా ఎక్కువ కాలాన్ని నిలవలేకపోయింది. ఆ సమయంలోనే ఈమె పైన డ్రగ్స్ ఆరోపణలు కూడా రావడం జైలుకు వెళ్లడం అలా ఒక్కొక్కటిగా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఈమెకి సినిమా అవకాశాలు కూడా పూర్తిగా కనుమరుగైపోయాయి. గడిచిన కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈమె ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇప్పుడు మరొకసారి తల్లి కాబోతున్నట్లు కొన్ని ఫోటోలను సైతం సోషల్ మీడియాలో తెలియజేసింది.
ఇటీవల ఉగాది పండుగను సెలబ్రేషన్స్ చేసుకొని తాను మరొకసారి తల్లి కాబోతున్నాననే విషయాన్ని బేబీ బంపర్ ఫోటోల ద్వారా వెల్లడించింది. అయితే మొదట సంజన గల్రానీ ని చూసిన అభిమానులు గుర్తుపట్ట లేకపోయినా ఆ తర్వాత గుర్తుపట్టి ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలను నటించాలి అంటూ అభిమానులు అయితే కోరుకుంటున్నారు.ఇక ఈమె సోదరీ కూడా సినీ ఇండస్ట్రీ లో పలు చిత్రాలలో నటించి హీరో ఆది పినిశెట్టి నీ ప్రేమించి వివాహం చేసుకుంది. ఆది పినిశెట్టి పలు భాషలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.