
పూణేలో ఐశ్వర్య రాయ్ కజిన్ శ్లోకా శెట్టి సోదరుడి పెళ్లిలో చాలా గ్రాండ్గా కనిపించారు. ఈ వేడుకకు ఐశ్వర్యరాయ్ కుటుంబ సభ్యులతోపాటు కూతురు భర్త అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు ముగ్గురు కలిసి స్టేజ్ పైన డాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లుగా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. దీంతో అటు అభిమానులకు మరింత ఆనందం కలుగుతోంది.ఎట్టకేలకు విడాకులకు రూమర్స్ కు మరొకసారి చెక్ పెట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ గతంలో ఎక్కువగా ఎలాంటి పార్టీకి హాజరైన తన కూతురు ఆరాధ్యతోనే మాత్రమే వెళ్లేది.
దీంతో పలు రకాల గుసగుసలు కూడా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉండేది. 2007లో అటు ఐశ్వర్యారాయ్, అభిషేక్ వివాహం చేసుకోగా 2011లో వీరికి ఆరాధ్య జన్మించింది. ఆరాధ్య పుట్టినరోజు వేడుకలలో కూడా అభిషేక్ లేకపోవడంతో దీంతో కచ్చితంగా ఈ జంట విడాకులు తీసుకున్నారనే విధంగా భావించారు. కానీ ఇలాంటి సమయంలోనే ఐశ్వర్య, అభిషేక్ ఇద్దరు కలిసి ఇలా డ్యాన్సులు చేస్తూ అన్నిటికీ చెక్ పెట్టేసారని చెప్పవచ్చు. ఐశ్వర్య రాయ్ కూడ ఈ మధ్యకాలంలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే తప్ప చిత్రాలలో నటించడానికి పెద్దగా మక్కువ చూపడం లేదు. అభిషేక కూడా ఈ మధ్యకాలంలో తక్కువ చిత్రాలు లోనే కనిపిస్తూ ఉన్నారు.