సహజనటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది జయసుధ మాత్రమే. ఈ హీరోయిన్ తర్వాత ఇప్పుడు ఎంతోమంది తమ న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ జయసుధ వేరే మొదటగా వినిపిస్తుంది. అయితే అలాంటి జయసుధ సినిమాల్లోకి వచ్చి ఎంతోమంది అప్పటి సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీగా పేరు తెచ్చుకుంది.అలా జయసుధ ఏఎన్నార్, శోభన్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణంరాజు, మురళీమోహన్,కృష్ణ వంటి ఎంతోమంది హీరోల సరసన నటించింది. అలా తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్న జయసుధని ఓ హీరోయిన్ షూటింగ్లో జుట్టు పట్టుకొని కొట్టిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే జయ చిత్ర.. చాలా రోజుల నుండి జయచిత్ర, జయసుధ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అనే రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. 

అయితే ఈ రూమర్లు నిజమే అని జయసుధ ఓ ఇంటర్వ్యూలో జయచిత్రతో జరిగిన గొడవ గురించి మాట్లాడింది. జయచిత్ర, జయసుధ ఇద్దరు కలిసి కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో జయసుధ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జయచిత్రకు నచ్చలేదు. దాంతో కాస్త అసూయపడిందట.ఇక ఈ సినిమా సన్నివేశంలో భాగంగా బీచ్ లో వీరిద్దరూ కొట్టుకునే ఒక సీన్ ఉంటుందట. ఆ టైంలో జయసుధ హీల్స్ వేసుకొని రావడంతో పొట్టిగా ఉన్న జయచిత్ర నువ్వు హీల్స్ ఎందుకు వేసుకున్నావు. నన్నేమో వద్దన్నారు నీకేమో హీల్స్ వేసుకోమని చెప్పారా అని గొడవ పడిందట. దాంతో గొడవ ఎందుకు అని జయసుధ హీల్స్ విప్పేసిందట. కానీ అప్పటికే ఇద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు వచ్చి షూటింగ్లో కొట్టుకునే సీన్ ఉంటే అందులో జీవించి నటించారట.

అయితే వీరిద్దరూ రియల్ గానే కొట్టుకున్నప్పటికీ అదంతా షూటింగ్ అని చాలామంది చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అని ఎంకరేజ్ కూడా చేశారట.అలా వీళ్ళిద్దరి మధ్య షూటింగ్లో మాట మాటా పెరిగి సీన్ కోసం ఏకంగా రియల్ గానే జుట్టు పట్టుకొని మరీ కొట్టుకున్నారట.ఇక ఈ సీన్ చూసిన డైరెక్టర్ కూడా షాట్ అద్భుతంగా వచ్చింది అని మెచ్చుకున్నారట.అయితే వీరిద్దరూ రియల్ గానే కొట్టుకున్నారు అనే విషయం మాత్రం అక్కడి వాళ్లకు తెలియదు. అయితే ఈ విషయాన్ని జయసుధ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది. అయితే ఇద్దరి మధ్య ఆ షూటింగ్లో గొడవ జరిగింది నిజమే కానీ ఆ గొడవని ఎప్పుడూ కూడా మళ్లీ గుర్తుపెట్టుకోలేదు.దాన్ని మర్చిపోయి ఏ సినిమా ఈవెంట్లో కలిసిన కూడా ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళం అంటూ జయసుధ చెప్పుకొచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: